ఈ ఏడాది (2020-21) విద్యా సంవత్సరానికి సంబంధించిన వైద్య విద్య కౌన్సెలింగ్ ప్రక్రియకు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నూతన ఫీజులకు సంబంధించిన జీవోను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఏవిధంగా జరపాలో ఉన్నత విద్యాశాఖ జీవో జారీ చేయాల్సిన అవసరం ఉందని వర్శిటీ ఉపకులపతి డా.శ్యామ్ ప్రసాద్ అన్నారు.
కౌన్సెలింగ్ ప్రక్రియ, స్లైడింగ్ విధానంపై ఉత్తర్వులు రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందని చెప్పారు. ఈనెల 15 లోపు మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తవుతుందని వివరించారు. ఈ నెలాఖరులోగా కానీ డిసెంబర్ మొదటి వారానికి విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
ఇదీ చదవండి: