ETV Bharat / city

NON COOPERATION MOVEMENT: ఆంధ్రనాట.. సహాయ నిరాక"రణం"

author img

By

Published : Sep 5, 2021, 2:24 PM IST

Updated : Jul 21, 2022, 12:36 PM IST

భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన భూమిక వహించిన సహాయ నిరాకరణోద్యమం... తెలుగునాట ఉవ్వెత్తున ఎగసిపడింది. పన్నుల నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటిష్ పదవులు-బిరుదులు త్యజిస్తూ మహోద్ధృతంగా సాగింది. స్వరాజ్య సాధనలో మమేకమవుతూ... పోరు హోరెత్తడానికి భూరి విరాళాలు అందజేసిన వారెందరో. మాకొద్దీ తెల్లదొరతనం అంటూ విదేశీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టేలా ఆంధ్రులు సింహాలై గర్జించిన ఆ పోరాటం... సంగ్రామ చరిత్రలో చిరస్మరణీయం.

non-cooperation-movement-for-independance-in-india
ఆంధ్రనాట.. సహాయ నిరాక"రణం"

భారత స్వాతంత్య్ర సమరంలో మహాద్భుత ఘట్టం సహాయ నిరాకరణోద్యమం. నాలుగు దశల్లో సాగిన ఈ ఉద్యమానికి... తెలుగు నేల పూర్తి అండగా నిలిచింది. స్కూళ్లు, కాలేజీలు బాయ్‌కాట్‌ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. గుంటూరు బార్‌ అసోయేషన్‌ ఆధ్వర్యాన న్యాయస్థానాలు బహిష్కరించారు. అనేకమంది స్వచ్ఛందంగా ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్నారు. బ్రిటిష్‌ వారి బిరుదులను తిరస్కరించారు. తెల్లదొరలకు పన్నులు కట్టేది లేదంటూ తెగేసి చెప్పారు. ఆంధ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కారు. సహాయ నిరాకరణ సెగ తట్టుకోలేకపోయిన తెల్లదొరలు... అరెస్టులు, లాఠీ ఛార్జిలతో అణచివేతకు యత్నించారు. ఆ సమయంలో 'మాకొద్దీ తెల్లదొరతనం' అంటూ ఉద్యమజ్వాల రగిల్చిన గరిమెళ్ల సత్యనారాయణ జైలు పాలయ్యారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రజల్ని ఏకోన్ముఖుల్ని చేశారు. మా గాంధీ కొల్లాయి కట్టితేనేమి, కోమటినైతేనేమి అని బసవరాజు అప్పారావు ఆంగ్లేయులను ప్రశ్నించారు.

ఆంధ్రనాట.. సహాయ నిరాక"రణం"

శాసన సభ్యత్వాలను వదిలేసిన మహానుభావులు..

సహాయ నిరాకరణోద్యమంలో తెలుగు వీరులెందరో మమేకమయ్యారు. కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు... శాసన సభ్యత్వాలను త్యజించారు. కల్లూరి సుబ్బారావు, కోడూరు ఆంజనేయులు సహా అనేకమంది ఉపాధ్యాయ వృత్తికి రాంరాం చెప్పేశారు. ప్రకాశం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, మధుసూధనరావు, హనుమంతరావు, అలీ బేగ్‌ లాంటి మహామహులు న్యాయవాద వృత్తికి రాజీనామా చేశారు. 'రామదండు' పేరిట సైనికదళం ఏర్పాటుచేసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.. తెలుగునాట ఈ పోరాటానికి ఉద్ధృతరూపం తీసుకొచ్చారు. స‌హాయ ‌నిరాక‌ర‌ణ స‌మ‌యంలోనే ఆంధ్రనాట అల్లూరి సీతారామ‌రాజు సారథ్యాన రంపా విప్లవం హోరెత్తింది. ప‌ల్నాడు పుల్లరి స‌త్యాగ్రహం, చేరాల‌-పేరాల ఉద్యమ‌ం, పెద‌నందిపాడు ప‌న్నుల నిరాక‌ర‌ణ... ఉద్యమాన్ని మరింత వేడెక్కించాయి.

కన్నెగంటి రీరంలోకి 26 తుపాకీ గుండ్లు..

తెల్లవాడికి భారతీయుడి వాడి ఏంటో చూపిన తెలుగింటి సార్జెంటు 'కన్నెగంటి హనుమంతు'. గుంటూరు జిల్లా పల్నాడు కార్యస్థలిగా... ఈ విత్తు నువ్వు పెట్టావా, నీరు నువ్వు పోశావా, మా జీవగడ్డపై నీ పెత్తనమేంటి అనే పిడుగుల్లాంటి ప్రశ్నలతో గర్జించాడు. శిస్తు ఎందుకు కట్టాలని రైతుల తరఫున గళమెత్తాడు. అడవుల్లో పుల్లలు ఏరుకోవడం, పశువులను మేపడంపై బ్రిటిష్ పాలకులు ఆంక్షలను ధిక్కరిస్తూ 'పుల్లరి సత్యాగ్రహం' నడిపాడు. హనుమంతు వీరత్యంతో వణికిపోయిన బ్రిటిషన్ పాలకులు... ప్రలోభ పెట్టేందుకు విఫలయత్నం చేశారు. చివరికి 1922 ఫిబ్రవరి 22న మించాలపాడులో కుట్రపూరితంగా కన్నెగంటిపై తుపాకులు ఎక్కు పెట్టారు. ఆయన శరీరంలోకి 26 తుపాకీ గుండ్లు దింపారు. అయినా వెరవని పల్నాటి పోరుబిడ్డ... సుమారు 2 గంటలపాటు బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. 30 ఏళ్ల వయసులో మరణించినా... బుర్రకథల్లో, జంగమదేవర గాథల్లో హనుమంతు నేటికీ నిలిచి ఉన్నాడు.

వేశ్య వృత్తిని వదిలేసి.. యావదాస్తి సమర్పణ..

తిల‌క్ స్వరాజ్య నిధి సేక‌రణ, కోటి మందిని ఉద్యమంలో భాగస్వాముల్ని చేయడం, 20 లక్షల చ‌ర‌ఖాల‌ ఏర్పాటు నిర్ణయాలకు... విజ‌య‌వాడ‌లో కాంగ్రెస్ ప్రత్యేక స‌మావేశం వేదికైంది. 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో నిర్వహించిన విజ‌య‌వాడ కాంగ్రెస్ సంఘం స‌మావేశంలో గాంధీజీ పాల్గొన్నారు. ఇక్కడే పింగ‌ళి వెంక‌య్య రూపొందించిన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని స్వల్ప మార్పుల‌తో ఆమోదించారు. మహాత్ముడి ఉప‌న్యాసాల‌ను అయ్యదేవర అనువదించారు. తిలక్‌ నిధి కోసం మాగంటి అన్నపూర్ణమ్మ... తన ఇంట్లోని బంగారు ఆభరణాలతోపాటు మంగళసూత్రాన్నీ దానమిచ్చారు. 'యామిని పూర్ణతిలకం' వేశ్య వృత్తిని వదిలేసి... యావదాస్తిని నిధికి సమర్పించారు.

పురుషులతో సమానంగా ఉద్యమంలోకి..

పురుషులతో సమానంగా అనేకమంది మహిళలు సమర శంఖం పూరించారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు, ఆరుట్ల కమలాదేవి, కనపర్తి వరలక్ష్మమ్మ, మాగంటి అన్నపూర్ణమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ సహా అనేకమంది పోరుబాటలో పయనించారు. ఒంటిమీది బంగారు నగలను ఉద్యమానికి సమర్పించారు. ఖద్దరు ధరించి, సమరగీతాలు ఆలపిస్తూ... పోలీసులతో లాఠీదెబ్బలూ తిన్నారు. అసమాన ధైర్యసాహసాలతో స్వాతంత్య్ర సమరధీరలుగా చరిత్రలో నిలిచిపోయారు. సహాయ నిరాకరణలో మమేకమైన వరలక్షమ్మ... సహచరులతో కలిసి స్వరాజ్య లక్ష్మీవ్రతం, రాట్నలక్ష్మి పూజలు చేశారు. స్వదేశీ దీక్షాసూత్రాలు కట్టుకున్నారు. సహాయనిరాకరణ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న చుండూరి రత్నమ్మ జైలుకు వెళ్లారు.

ఇదీ చూడండి: teachers day:గురుశిష్యులు బంధం.. అమోఘం..అద్వితీయం

Last Updated : Jul 21, 2022, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.