ETV Bharat / city

మరణించిన వారికి బదులుగా.. నేడు కొత్త నామినేషన్ల దాఖలుకు అవకాశం - sec latest news

నగర, పుర పాలక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసి మరణించిన వారి స్థానాల్లో.. అదే పార్టీకి చెందినవారు కొత్తగా నామినేషన్​ వేసేందుకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈరోజు మద్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. మార్చి 3వ తేదీన ఉపసంహరణకు గడువుగా తెలిపింది.

Nominations today
నేడు నామినేషన్లు
author img

By

Published : Feb 28, 2021, 10:17 AM IST

పుర ఎన్నికల్లో నామినేషన్లు దాఖలుచేసి మరణించిన 59 మంది స్థానంలో అదే పార్టీకి చెందినవారి నుంచి నామినేషన్ల స్వీకరణకు పురపాలకశాఖ ఏర్పాట్లు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకొని మార్చి 1న పరిశీలిస్తారు. 3న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రచురిస్తారు. గత మార్చిలో నామినేషన్లు వేసిన వారిలో 9 నగరపాలక సంస్థల్లో, 35 పురపాలక, నగర పంచాయతీల్లో కలిపి 59 మంది మృతిచెందారు. ఏ పార్టీవారు చనిపోయారో అదే పార్టీ తరఫున మరొకరు బీఫారంతో నామినేషన్‌ వేసే వెసులుబాటు కల్పిస్తూ ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

నామినేషన్లు తీసుకునేది ఇక్కడే..

నగరపాలక సంస్థలు: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ), కడప, విజయవాడ, గుంటూరు, కర్నూలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు, ఒంగోలు.

పురపాలక, నగర పంచాయతీలు: తుని, మార్కాపురం, కదిరి, రాయచోటి, మైదుకూరు, యర్రగుంట్ల, ఆత్మకూరు (నెల్లూరు జిల్లా), హిందూపురం, సూళ్లూరుపేట, పలాస-కాశీబుగ్గ, గొల్లప్రోలు, జంగారెడ్డిగూడెం, తెనాలి, రేపల్లె, చీమకుర్తి, తాడిపత్రి, పుట్టపర్తి, మడకసిర, గూడూరు (కర్నూలు జిల్లా), బద్వేలు, పుత్తూరు, పార్వతీపురం, నెల్లిమర్ల, రామచంద్రపురం, ఏలేశ్వరం, తిరువూరు, చిలకలూరిపేట, గిద్దలూరు, వెంకటగిరి, ధర్మవరం, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆదోని, ప్రొద్దుటూరు, పుంగనూరు.

రెండు చోట్ల పరిశీలనకు అనుమతి:

జీవీఎంసీ పరిధిలోని 82వ వార్డులో ఎ.ఇందు వేసిన నామినేషన్‌, కృష్ణాజిల్లా తిరువూరు 9వ వార్డులో వి.అప్పారావు వేసిన నామినేషన్ల పరిశీలనకు ఎస్‌ఈసీ అనుమతించింది. కొన్ని పత్రాలు అందజేయలేదని గత మార్చిలో ఈ రెండింటినీ పక్కన పెట్టి, పత్రాలు సమర్పించేందుకు మరో తేదీ ప్రకటించారు. ఈలోగా ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఇదే విషయాన్ని ఎస్‌ఈసీ దృష్టికి బాధితులు తీసుకురాగా.. నామినేషన్ల పరిశీలనకు అనుమతించారు.

ఇదీ చదవండి:

తెదేపాకు షాక్.. వైకాపాలో చేరిన నలుగురు కౌన్సిలర్ అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.