ETV Bharat / city

చాలా ప్రాంతాల్లో అందుబాటులో లేని అగ్నిమాపక వాహనాలు - చాాలా జిల్లాల్లో అందుబాటులో లేని అగ్నిమాపక వాహనాలుట

ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే.. అక్కడికి అత్యంత వేగంగా చేరుకొని, సహాయక చర్యలు చేపట్టగలిగితేనే ప్రమాద తీవ్రత, నష్టాన్ని తగ్గించవచ్చు. అదే ఘటనా స్థలానికి చేరుకోవడంలోనే ఆలస్యమైతే ప్రమాద తీవ్రత మరింత పెరిగి నష్టమూ అధికమవుతుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు లేకపోవటంతో.. సహాయక చర్యలు తొంగరగా అందటం లేదు. అధికారులు దీనిపై దృష్టి సారించి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

no suffecient fire engines in some districts
చాలా ప్రాంతాల్లో అందుబాటులో లేని అగ్నిమాపక వాహనాలు
author img

By

Published : Mar 24, 2021, 8:32 AM IST

రాష్ట్రంలో చాలా చోట్ల అగ్నిమాపక కేంద్రాలు లేకపోవటం వల్ల.. ప్రమాదం సంభవిస్తే సుదూరం నుంచి అగ్నిమాపక శకటాలు, సిబ్బంది రావాల్సి వస్తోంది. ఈలోగా ఆస్తి కాలి బూడిదైపోతోంది. ఇప్పటికే వేసవి సమీపించింది. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయమిదే. ఈ తరుణంలో అగ్నిమాపక కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాలు, అక్కడ ప్రమాదాలకు ఆస్కారమున్న హాట్‌స్పాట్‌లను గుర్తించాల్సిన అవసరం ఉంది. వేగంగా సహాయక చర్యలు అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాల్సి ఉంది.
గంటలపాటు ఎదురు చూడాల్సిందే..

  • కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు తదితర మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలు లేవు. 50-70 కి.మీ దూరంలోని ఆదోని నుంచి శకటాలు రావాలంటే కనీసం గంటన్నర నుంచి రెండు గంటలు పడుతుంది. ప్రముఖ పుణ్య క్షేత్రమున్న మంత్రాలయానికి.. 30-40 కి.మీ దూరంలోని ఎమ్మిగనూరు నుంచి రావాలి. దూరం అధికంగా ఉండటం వల్ల వాహనాలు చేరుకునేందుకు ఆలస్యమవుతోంది. ప్రమాదాల్లో నష్టం పెరుగుతోంది. నందికొట్కూరు ప్రాంతానికి కర్నూలు, ఆత్మకూరు నుంచి సిబ్బంది చేరుకునేందుకు కనీసం 45 నిమిషాలు పడుతుంది. కొన్నాళ్ల కిందట నందికొట్కూరు మండలం 10 బొల్లావరంలో ఓ ఏసీ గోదాములో తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. అక్కడికి అగ్నిమాపక శకటాలు చేరుకునేలోగా మొత్తం దగ్ధమైపోయింది.
  • పశ్చిమగోదావరి జిల్లా పోలవరం సమీపంలో అగ్నిమాపక కేంద్రాల్లేవు. ఇక్కడికి సమీపంలోని కొవ్వూరు 30-35 కి.మీ దూరంలో ఉంది. ఇక మారుమూల పల్లెలకు చేరుకోవాలంటే మరో 30 కి.మీ అదనంగా ప్రయాణించాలి. అనంతపురం జిల్లా గుత్తి మండలానిదీ ఇదే పరిస్థితి. ఇక్కడికి అనంతపురం లేదా గుంతకల్లు నుంచి అగ్నిమాపక యంత్రాలు రావాలి. రాష్ట్రంలోని దాదాపు 30 నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి పరిస్థితే ఉంది.
    వారికి ఒడిశాయే దిక్కు: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఒడిశాయే దిక్కు. లేదంటే 35 కి.మీ దూరంలోని టెక్కలి, 40 కి.మీ దూరంలోని నరసన్నపేట, 30 కి.మీ దూరంలోని కొత్తూరు ప్రాంతాల నుంచి శకటాలు రావాలి. ఇక్కడ ప్రమాదం సంభవించినా.. ఒక్కోసారి ఒడిశా యంత్రాంగం నుంచి స్పందన ఉండదు. ఒకే సమయంలో ఇటు ఆంధ్రలో, అటు ఒడిశాలోనూ ప్రమాదాలు చోటుచేసుకుంటే వారు సొంత రాష్ట్రంలోనే రంగంలోకి దిగాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో సకాలంలో సహాయక చర్యలు అందక ఏపీలో నష్టం అధికమవుతుంది.
    ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండాల్సిందే
  • వాహనాల సమస్యను తాత్కాలికంగానైనా అధిగమించడానికి.. అగ్నిమాపక కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ వేసవిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
  • రెండు, మూడు శకటాలు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో నుంచి ఒకదాన్ని, కొంతమంది సిబ్బందిని మరో ప్రాంతానికి తరలించడం మేలు. అయితే క్షేత్రస్థాయిలో దాదాపు 40 శాతం సిబ్బంది ఖాళీలు ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

100 కిలోమీటర్ల ఆవలే!
విశాఖపట్నం మన్యంలోని సీలేరు ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే 120 కి.మీ దూరంలోని నర్సీపట్నం లేదా 140 కి.మీ దూరంలోని పాడేరు నుంచి శకటాలు, సిబ్బంది రావాలి. ఇక్కడి మారుమూల గూడేలకు అయితే.. దూరం మరింత పెరుగుతోంది. ప్రమాద సమాచారం అందుకుని, వెనువెంటనే సన్నద్ధమైనా నర్సీపట్నం నుంచి సీలేరుకు చేరుకునేందుకు 3 గంటలు పడుతుంది. అరకు మండలంలోనూ అగ్నిమాపక కేంద్రం లేదు. 56 కి.మీ దూరంలోని పాడేరు, 60 కి.మీ దూరంలోని ఎస్‌.కోట నుంచి అగ్నిమాపక శకటాలు, సిబ్బంది రావాలి. కనీసం గంటన్నర పడుతుంది.

ప్రమాణాలు ఇలా..
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 50 వేల మంది జనాభాకు, 10 కి.మీ పరిధికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలి. ఈ లెక్కన చూస్తే రాష్ట్రంలో 1,000కి పైగా కేంద్రాలు అవసరం కాగా.. ఉన్నవి 178 మాత్రమే. జనాభా పరంగా చూస్తే.. ప్రతి 3 లక్షల మందికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉంది. ప్రతి 10 కి.మీ పరిధిలో ఒక కేంద్రం నిబంధన అమలు కావడం లేదు.

ఇదీ చదవండి: లోపాయికారీ ఒప్పందంతోనే జేపీ వెంచర్స్​కు ఇసుక టెండర్లు: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.