ETV Bharat / city

అటకెక్కిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం.. రైతులు బృందాలుగా వస్తే ఇస్తామంటున్న యంత్రాంగం... - వ్యవసాయ కూలీల కొరత తాజా వార్తలు

కూలీల కొరతతో అన్నదాతలు ఆధునిక యంత్రాలవైపు మెగ్గుచూపుతున్నారు. ఏటికేడు యంత్రాలతో సాగు పెరుగుతూ వస్తోంది. అయితే యంత్రాల ధరలు అధికంగా ఉండటం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ లేక రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఇప్పుడు అందడం లేదు. కానీ ప్రభుత్వం నూతనంగా అద్దెకిచ్చే కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం రైతు బృందాలు ముందుకు వస్తే రాయితీలు ఇవ్వడానికి సిద్ధం అంటోంది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే!

no subsidy for agriculture machines
అటకెక్కిన యాంత్రీకరణ అన్నదాతలపై భారం
author img

By

Published : Jan 15, 2021, 1:32 PM IST

Updated : Jan 15, 2021, 1:47 PM IST

పంటల సాగుకు కూలీల సమస్య తీవ్రంగా ఉంది.. భూమి దున్నటం మొదలు పంట నూర్పిడి వరకు యంత్రాల వినియోగం లేకుండా రైతుకు సాగు సాధ్యం కావడం లేదు. ఉపాధి పథకం అమలుతో వ్యవసాయ కూలీలకు డిమాండు పెరిగింది. అనాధిగా వస్తున్న ఎడ్ల సేద్యం ఏటికేడు కనుమరుగవుతూ వస్తోంది. ఈక్రమంలో యాంత్రీకరణ ప్రాధాన్యతగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుపై రైతులకు పెద్దఎత్తున రాయితీలు ఇచ్చాయి. కానీ రాష్ట్రంలో ఏడాదిన్నరగా రాయితీ పథకం అటకెక్కింది. వ్యక్తిగత పరికరం లేనట్టేపంటల సాగులో కూలీల సమస్యకు పరిష్కారంగా గతంలో ప్రభుత్వాలు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేశాయి. ఏటా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించేది. రైతులు వ్యక్తిగతంగా కొనుగోలు చేసే యంత్రాలపై 50 శాతం రాయితీ ఇచ్చేది. ట్రాక్టర్లు, టార్పాలిన్లు, మందు పిచికారీ స్ప్రేయర్లు, విత్తన గొర్రు, పంట నూర్పిడి యంత్రాలు, కాడెద్దులతో సేద్యం చేసే పరికరాలు, ట్రాక్టర్‌కు అమర్చి పరికరాలు ఇలా అనేకం రాయితీపై సరఫరా అయ్యేవి. ఈ పథకానికి రెండేళ్లుగా నిధుల కేటాయింపులేదు. వ్యక్తిగతంగా రాయితీ పరికరాలిచ్చే పథకం స్థానంలో అద్దెకిచ్చే కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

అద్దె కేంద్రాలు అంతంతే..

వ్యక్తిగత రాయితీ పథకాన్ని నిలిపేసిన ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంలో కస్టమ్‌ హైరింగ్‌ (అద్దెకిచ్చే) పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. ప్రతి ఆర్బీకేలో రూ.15 లక్షల విలువచేసే పలు యంత్రాలు అందుబాటులో ఉంచి, రైతులు అద్దెకు తీసుకోవచ్చని అధికారులు ప్రచారం చేశారు. రైతులు బృందంగా ఏర్పడి అద్దె కేంద్రాలు ఏర్పాటు చేస్తే రూ.15 లక్షల పథకానికి 40 శాతం రాయితీగా ఇస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 859 రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అయితే యంత్రాల జాబితా నుంచి ట్రాక్టర్‌ను తొలగించడంతో రైతులు ముందుకు రాలేదు. దీంతో కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన సాగడంలేదు.

రూ.16 కోట్ల బకాయిలు..

2018కి పూర్వం రైతు రథం పథకంలో ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు రైతులకు విక్రయించిన కంపెనీలకు రాయితీ బకాయి చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.16 కోట్ల రెండేళ్లుగా చెల్లించడం లేదు. ఈ పథకం కింద 2016లో 6,200 మంది, 2017 లో 4,273, 2018లో 3,600 రైతులకు రాయితీగా యంత్ర పరికరాలు అందించారు. ఈ బకాయి చెల్లించేవరకు కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలకు యంత్రాలు సరఫరాకు కంపెనీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

ఇకపై అద్దె కేంద్రాలే ఉండవచ్చు..

రైతులకు వ్యక్తిగత రాయితీ పరికరాల పథకం ప్రస్తుతం అమలులో లేదు. ఆర్బీకేకు అనుబంధంగా కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు (అద్దె) ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. ఈ కేంద్రాల్లో యంత్రాలు, పరికరాలు అద్దెకు ఇచ్చే ప్రణాళిక చేశాం. గతంలో ట్రాక్టర్లు, పరికరాలు విక్రయించిన కంపెనీలకు రూ.16 కోట్ల బకాయి ఉంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. _రామకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ

ఇదీ చదవండి: యంత్రాల వాడకం పెరిగెను.. సాగు తీరు మారెను

Last Updated : Jan 15, 2021, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.