ETV Bharat / city

Corona Deaths: కోలుకుంటున్న నాగపూర్​.. మరణాలు నిల్! - ఏపీ తాజా వార్తలు

కరోనా నుంచి నాగపూర్ నగరం బయటపడుతుంది. గత వారం రోజులుగా రికవరీ రేటు పెరుగటం కాకుండా.. ఒక్క మరణమూ సంభవించలేదు. ఇందుకు హెర్డ్ ఇమ్యూనిటీ పెరగడంతో పాటు.. వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలే ప్రధాన కారణమంటున్నారు వైద్య నిపుణులు.

Nagapur Corona Deaths
Nagapur Corona Deaths
author img

By

Published : Jun 21, 2021, 9:01 PM IST

మహారాష్ట్ర.. కరోనా సెకండ్ వేవ్​లో ఉక్కిరిబిక్కిరి అయింది. అందులోనూ నాగపూర్​ పట్టణంపై వైరస్ పంజా విసిరింది. ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. కరోనా నుంచి నాగపూర్ నగరం కోలుకుంటోంది. అందుకు తాజా గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నగరంలో గత వారం రోజుల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదు. శుక్రవారం నగరంలో 8856 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కేవలం 39 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఇందులో నగరానికి చెందిన 26 మంది.. మిగతా జిల్లాకు చెందిన 13 మంది ఉన్నారు. తాజాగా 134 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. 96 మంది నాగపూర్ సిటీకి చెందినవారు ఉండగా.. 38 మంది వివిధ జిల్లాలకు చెందినవారు. ప్రస్తుతం నగరంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో 228 మంది చికిత్స పొందుతున్నారు.

కారణాలు ఇలా ఉన్నాయి..

నాగపూర్​లో తాజా పరిస్థితికి హెర్డ్ ఇమ్యూనిటీ పెరగడమే కారమణని వైద్యులు చెబుతున్నారు. ఇందుకుతోడు వైరస్ వ్యాప్తికి ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు కూడా ఇందుకు ప్రధాన కారణంగా వివరిస్తున్నారు.

ఇదీ చదవండి

పవార్​తో పీకే రెండోసారి- సరికొత్త రాజకీయాలకు ఆరంభమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.