ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకుతో విలీనం విషయమై ఏపీలోని కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తనకు తెలయడం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయమై పలువురు ప్రజాప్రతినిధులు లేఖలు రాసినట్లుగా చెబుతున్నా...ఆ లేఖలు ఇంతవరకు తనకు చేరలేదని... నరేంద్ర మోదీ ప్రభుత్వం 100 రోజుల పాలనా విజయాలపై చెన్నైలో నిర్వహించిన సమావేశంలో ఆమె బదులిచ్చారు. బ్యాంకుల విలీనంవలన పలు ప్రయోజనాలున్నాయని... బ్యాంకులకు నగదు లభ్యత విరివిగా పెరగడం వలన ఖాతాదారులకు రుణ వితరణ పెరగనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి-ఆంధ్రబ్యాంకు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అఖిలపక్షం