హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తిరిగి హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. కోర్టు ధిక్కారం కింద సోమవారం (రేపు) పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా తాను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా.. తన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.
హైకోర్టు వేసవి సెలవుల్లో ఉండటంతో వెకేషన్ బెంచ్‌ని ఆశ్రయించి పిటిషన్ వేసేందుకు నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు నిమ్మగడ్డ పునర్ నియామకంపై ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేయాలని ప్రభుత్వం...హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు, సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడం..కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని, స్వతంత్రత కలిగిన రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు అత్యంత విచారకరంగా ఉందని రమేశ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చర్యలు హైకోర్టు తీర్పునకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ