ETV Bharat / city

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ - telangana latest news

corona cases in telangana
night curfew in telangana
author img

By

Published : Apr 20, 2021, 11:39 AM IST

Updated : Apr 20, 2021, 1:46 PM IST

11:38 April 20

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు

night curfew in telangana
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు లేవు: ప్రభుత్వం

అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరంలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి పాసులు అవసరం లేదని తెలిపింది.  కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల రాత్రి కర్ఫ్యూ విధించాయి. రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకిందనీరులా విస్తరిస్తోంది. నిన్న ఒక్క రోజే కొత్తగా 5,926 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న  కరోనాతో 18 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 1,856కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న కొత్తగా 793 మంది వైరస్‌ బారిన పడ్డారు. 

హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం..

 కొవిడ్‌ నియంత్రణలో ఉదాసీనతపై సోమవారం  ఆ రాష్ట్ర హైకోర్టు మండిపడింది. 10 రోజుల సమయం ఇచ్చినా ఏ ఒక్క ఆదేశం అమలు చేయలేదని తప్పుపట్టింది. మీరు చేయకపోతే మేం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాజకీయర్యాలీలు.. బార్లు.. సినిమా హాళ్లు... పెళ్లిళ్లు.. అంత్యక్రియల్లో రద్దీని ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించింది.  ‘‘మద్యం దుకాణాల్లో వచ్చే ఆదాయంపై ఉన్న దృష్టి ప్రజల ప్రాణాలపై లేదా? వారంరోజుల్లో కేసులు రెట్టింపయ్యాయి. ఇంట్లోనే రక్షణ ఉండడంలేదు’’ అని పేర్కొంది. కోర్టుకు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు ఇవ్వకపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీసుకుంటున్న చర్యలపై జిల్లాలవారీగా పరీక్షలు ఎన్ని, పాజిటివ్‌లు ఎన్నెన్నో వివరాలడిగితే ఇవ్వలేదంది. ఓ వైపు ఆరోగ్యశాఖ మంత్రి ఆక్సిజన్‌ నిల్వలు లేవని చెబుతుంటే మరోవైపు ఆక్సిజన్‌ తగినంత ఉందని ఆరోగ్యశాఖ కోర్టుకు చెబుతోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని, రెమ్‌డెసివిర్‌ కొరతపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దిల్లీలో పరిస్థితి చూస్తూ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? రాత్రిపూట.. వారాంతాల్లో కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీరు చర్యలు తీసుకుంటారా? లేక మమ్మల్ని ఆదేశాలివ్వమంటారా? ఈ పనులన్నీ చేయాల్సిన బాధ్యత మీది.. మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు? 48 గంటల్లో నిర్ణయం తీసుకోండి అని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కరోనాకట్టడిపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి
ఒక్కరోజు 2 లక్షల 59 వేల కేసులు- 1761 మరణాలు

Last Updated : Apr 20, 2021, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.