పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రాజెక్టు వ్యర్థాల డంపింగ్‌పై పెంటపాటి పుల్లారావు, ముంపు ప్రాంతాల ప్రభావంపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్లను ఎన్జీటీ విచారించింది. ప్రణాళిక లేకుండా కాఫర్ డ్యామ్ నిర్మించారని పెంటపాటి పుల్లారావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఎందుకు విచారణకు రాలేదని ఎన్జీటీ ప్రశ్నించింది. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ట్రైబ్యునల్‌కు వివరించారు. ఎన్జీటీ విచారణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి బీపీ పాండే హాజరయ్యారు.
కాఫర్ డ్యామ్ నిర్మాణంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సంయుక్త కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. పొంగులేటి వేసిన పిటిషన్ గురించి నివేదిక అందజేయాలని పీపీఏకు సూచించింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు ముంపుపై నివేదిక ఇచ్చామని కేంద్రం తరఫు న్యాయవాది ఎన్జీటీకు తెలిపారు. అదే నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించిన ట్రైబ్యునల్.. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: