తెలంగాణలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగళ్లతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది. ఈరోజు ఉత్తర - తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిందని పేర్కొంది.
ఇదీ చూడండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎంత వరకు సబబు ?: చిరంజీవి