ETV Bharat / state

విజయవాడ రోడ్డుపై అడుగడుగునా గుంతలు - అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బస్సు - RTC BUS HITS TREE DUE TO POTHOLES

రోడ్డుపై భారీ గోతులుండటంతో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బస్సు - ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలు, ప్రయాణికులు క్షేమం

RTC_Bus_Hits_Tree_Due_to_Potholes
RTC_Bus_Hits_Tree_Due_to_Potholes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 5:20 PM IST

RTC Bus Hits Tree Due to Huge Potholes on Road: రోడ్డుపై భారీ గోతులుండటంతో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పెదపారుపూడి మండలం వానపాముల వద్ద గుడివాడ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో రోడ్డుపై భారీ గోతులు ఉండటంతో అదుపుతప్పి తప్పి చెట్టును ఢీ కొట్టింది. చెట్టును ఢీకొని బస్సు ఆగకపోతే భారీ ప్రమాదం జరిగేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా రోడ్లు బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్​కి ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారు. డ్రైవర్​ను చికిత్స నిమిత్తం గుడివాడ హాస్పిటల్ తరలించారు.

గుడివాడ - విజయవాడ రోడ్డు పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు అడుగుకో గుంతతో వాహనాలకు ఆహ్వానం పలుకుతోంది. అధ్వానంగా తయారైన రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. నరకదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ రెండు రోడ్లు పూర్తయితే దూసుకుపోవడమే! - విజయవాడ తూర్పు బైపాస్ ఎక్కడినుంచి వెళ్తుందంటే!

ఇవేమి రోడ్లు బాబోయ్ - అడుగుకో గుంత, గజానికో గొయ్యి - Damaged Roads in Srikakulam

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.