ETV Bharat / city

News MLC's met Governor : గవర్నర్ ను కలిసిన.. నూతన ఎమ్మెల్సీలు

author img

By

Published : Dec 25, 2021, 4:52 PM IST

News MLC's met Governor : నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

News MLC's met Governor
గవర్నర్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు

News MLC's met Governor : కొత్తగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్​కు వెళ్లిన వారికి.. గవర్నర్ పలు సూచనలు చేశారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాసన వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన మండలికి వన్నె తేవాలని, అర్ధవంతమైన చర్చలతో ప్రజాసమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని గవర్నర్ సూచించారు.

ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్న తలశిల రఘురామ్.. ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న సంక్షేమ కార్యక్రమాల గురించి గవర్నర్ కు వివరించారు. వైకాపా కార్యాలయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి.. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రెడ్ క్రాస్ నేతృత్వంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవ కార్యక్రమాలను గురించి గవర్నర్ కు వివరించారు.

ఇదీ చదవండి : CJI In Christmas Celebrations: నోవాటెల్​లో క్రిస్మస్ వేడుకలు.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.