ఓ వైపు పీఆర్‌సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు చెల్లింపునకు కార్యాచరణ చేపట్టింది. ఈమేరకు ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.
ఇదీచదవండి: EMPLOYEES PROTEST : ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం...నేడు కలెక్టరేట్ల ముట్టడి