ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో రైతుబజార్లు - ఏపీలో మార్కెట్ యార్డుల్లో రైతుబజార్లు

ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో రైతుబజార్లు ఏర్పాటు చేయనున్నారు. మార్కెట్‌యార్డ్ గిడ్డంగులు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్ల విక్రయాలు ఇక్కడే జరగనున్నాయి. కరోనా కారణంగా ప్రజారోగ్యం దృష్ట్యా కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రైతుబజార్లు 417కు పెరిగాయి.

rythu bazar
rythu bazar
author img

By

Published : Apr 25, 2020, 10:16 AM IST

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌యార్డుల్లో రైతుబజార్లు అందుబాటులోకి రానున్నాయి. మార్కెట్‌ యార్డు గిడ్డంగులు, ప్లాట్‌ఫారాలపై కూరగాయలు, పండ్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా ప్రజారోగ్యం దృష్ట్యా కొత్త రైతుబజార్లను ఏర్పాటు చేసినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 216 మార్కెట్ కమిటీల్లో 150 మార్కెట్‌ యార్డులు ఉండగా... ప్రస్తుతం ఈ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వ్యవసాయ యార్డుకు నిత్యం 200 మంది వస్తున్నట్లు అంచనా వేశారు. పరిసర ప్రాంతాల ప్రజలకూ అనువుగా ఉండేలా ఇక్కడే కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కూరగాయలు, పండ్లను తక్కువ ధరకే అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. మార్కెట్‌ కమిటీల పరిధిలో మేజర్‌ పంచాయతీల్లో రైతుబజార్లు ఏర్పాటు చేశారు. గిడ్డంగులు లేని యార్డుల్లో తాత్కాలిక షెడ్లు వేసి విక్రయాలు చేపట్టనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. కొనుగోలుదారులు పెద్దగా వచ్చే అవకాశం లేని యార్డులకు మినహాయింపు ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి: ప్రపంచవ్యాప్తంగా లక్షా 92 వేలు దాటిన కరోనా మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.