ETV Bharat / city

నూతన పారిశ్రామిక విధానం సరిగా లేదు: సోము వీర్రాజు - somu veerraju comments on Jagan

నూతన పారిశ్రామిక విధానం సరిగా లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నష్టం చేసేలా విధానం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయా వర్గాలకు ఇస్తున్న పారిశ్రామిక రాయితీలు ఎత్తివేశారన్న సోము వీర్రాజు... పరిశ్రమ పెట్టిన మూడేళ్ల తర్వాతే రాయితీల వర్తింపు సరికాదన్నారు.

New industrial policy is not right: Somu veerraju
నూతన పారిశ్రామిక విధానం సరిగా లేదు: సోము వీర్రాజు
author img

By

Published : Aug 25, 2020, 4:44 PM IST

రాష్ట్ర ప్రభుత్వం జీవో 39తో తీసుకొస్తోన్న 2020-23 నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ వర్గాలకు 2015-20 పారిశ్రామిక విధానంలోని రాయితీలను తీసేశారని... సబ్సిడీ శాతాన్ని 45 నుండి 35 శాతానికి తగ్గించారని ఒక ప్రకటనలో విమర్శించారు. గతంలో పరిశ్రమ పెట్టిన ఆరు నెలల్లో సబ్సిడీ వచ్చేదని... ఇప్పుడు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు యూనిట్ విజయవంతంగా నడుస్తూ వుంటేనే రాయితీ ఇస్తారని... గతంలో 75 లక్షల రూపాయలకు గరిష్టంగా ఉన్న సబ్సిడీని 50 లక్షల రూపాయలకు తగ్గించారన్నారు.

నూతన విధానం ప్రకారం సేవా రంగానికి సబ్సీడి పూర్తిగా ఎత్తేశారని... నూతన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవని ఆక్షేపించారు. దీనివల్ల కొత్తగా పరిశ్రమలు రావని... అలాంటప్పుడు 'ఉద్యోగ కల్పన' అనే అంశానికి అవకాశం లేదన్నారు. బ్యాంకర్లు ముందుకు రారని... మూడేళ్ల తర్వాత రాయితీలు ఇస్తామన్నా ఆచరణలో ఆరేళ్లు పడుతుందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి మందగించి... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుందని వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఏపీఐఐసీ పైనా దీని ప్రభావం పడుతుందని... ప్లాట్లు కొనుగోలుకు ఔత్సాహికులు వెనుకంజ వేస్తారని పేర్కొన్నారు. ప్రోత్సాహకాల కోసం ఎదురుచూసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇది నిరుత్సాహం కలిగిస్తోందన్నారు.

పెట్టుబడి రాయితీల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు గతంలో గరిష్ఠంగా 30 లక్షల రూపాయలు రాయితీ ఉండగా... ఇప్పుడు దానిని జనరల్ కేటగిరితో కలిపి ఇరవై లక్షల రూపాయలకు పరిమితం చేసి అన్యాయం చేశారని ఆరోపించారు. తీసుకున్న రుణంపై గతంలో పావలా వడ్డీ మాత్రమే వసూలు చేయగా... ఇప్పుడు దానిని తొమ్మిది శాతానికి పెంచారని చెప్పారు. పారిశ్రామికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నూతన పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని... పాత విధానాన్ని కొనసాగిస్తూ... లబ్దిదారుల ప్రయోజనాలు కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిని పర్యవేక్షించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... రమేష్ ఆసుపత్రి ఎండీపై తదుపరి చర్యలు నిలిపివేయండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.