పేద కుటుంబంలో అర్జించే వ్యక్తి మరణించినప్పుడు... మృతుల కుటుంబసభ్యులకు వెంటనే సాయమందేలా వైఎస్సార్ బీమా పథకంలో మార్పులు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
మార్గదర్శకాల ప్రకారం...
- సంపాదించే వ్యక్తి 18-50 ఏళ్ల మధ్య వయస్సు ఉండి... సహజంగా మరణిస్తే రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తారు.
- సంపాదించే వ్యక్తి 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు కలవారై... ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తారు.
ప్రభుత్వం అందించే మొత్తాన్ని మృతుల నామినికీ చెల్లించాలని నిర్ణయించింది. బీమా సంస్థ ద్వారా ఈ పరిహారాన్ని అందజేస్తామని తెలిపింది. ఎంపికైన బీమా సంస్థకు ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది.కార్మిక శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల విభాగం పథకాన్ని అమలు చేస్తుంది. బీపీఎల్ కుటుంబాలను ఈ నెలాఖరులోగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జూలై 1 నుంచి కొత్త మార్పులతో వైఎస్సార్ బీమా అమలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: శిల్పా మెడికేర్‌లో 2-డీజీ ఔషధ తయారీ