ETV Bharat / city

ఉత్సాహంగా నూతన జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభం

Collectorates and SP offices Opening: రాష్ట్రవ్యాప్తంగా నూతన జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్లు, ఎస్పీలకు శుభాకాంక్షలు తెలిపారు.

1
1
author img

By

Published : Apr 4, 2022, 12:02 PM IST

పాడేరులో అల్లూరి సీతారామరాజు కలెక్టర్‌ కార్యాలయాన్ని.. కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ, జెడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర ఇందులో పాల్గొన్నారు. డీఆర్​వో దయానిధి, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషేక్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సతీష్ కుమార్ ధనుంజయ్ ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

పార్వతీపురం మన్యం జిల్లా కార్యాలయాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. కార్యక్రమంలో పార్వతీపురం, బొబ్బిలి, పాలకొండ, సాలూరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నూతనంగా భాద్యతలు తీసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిసుభాష్‌, జాయింట్ కలెక్టర్‌గా కల్పనా కుమారి బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి.. ఆ తర్వాత కార్యకలాపాలు అధికారికంగా మొదలుపెట్టారు. కలెక్టర్‌ను ఎంపీ సత్యవతి, విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమరనాథ్, రమణమూర్తి రాజు, అదీప్ రాజ్, ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి ఎస్పీ గౌతమి సాలి జాతీయ జెండా ఆవిష్కరించి.... ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, సంయుక్త కలెక్టర్‌గా ధ్యానచంద్ర, ఎస్పీగా సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు విశ్వరూప్, వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. నూతన కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఎస్పీ రఘువీరారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా శ్రీవత్స్‌ నుపుర్ అజయ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. నూతన జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. సిబ్బంది సహకారంతో ఎన్టీఆర్‌ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పనిచేసినందున ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉందని... దీనివల్ల సమస్యల పరిష్కారం సులువవుతుందని అన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బసంత్ కుమార్, ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు సత్యసాయి మహాసమాధిని కలెక్టర్ బసంత్ కుమార్ దర్శించుకున్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు, త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని.. అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ తెలిపారు. డీఐజీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లా ప్రజల సమస్యలు తీర్చడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: New Districts: రాష్ట్రంలో 13 నుంచి 26కు పెరిగిన జిల్లాలు.. ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.