ETV Bharat / city

IIT: నూతన విద్యాసంవత్సరం నుంచి ఐఐటీల్లో కొత్త కోర్సులు - new academic year

ఐఐటీలు వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో బీటెక్‌తో పాటు ఎంటెక్‌లో విభిన్న రకాల కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాయి. జనరల్‌ కోర్సులే కాకుండా జాతీయ నూతన విద్యా విధానం మేరకు ఒక కోర్సులో బహుళ రంగాల అంశాలను అధ్యయనం చేసే మల్టీ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టనున్నాయి.

New courses in IITs
ఐఐటీల్లో కొత్త కోర్సులు
author img

By

Published : Jun 5, 2021, 7:39 AM IST

ఐఐటీలు వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో బీటెక్‌తో పాటు ఎంటెక్‌లో విభిన్న రకాల కోర్సులు అందుబాటులోకి తెస్తున్నాయి. జనరల్‌ కోర్సులే కాకుండా జాతీయ నూతన విద్యా విధానం మేరకు ఒక కోర్సులో బహుళ రంగాల అంశాలను అధ్యయనం చేసే మల్టీ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టనున్నాయి. ఫలితంగా ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. బీటెక్‌ సీట్లను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.

దేశంలోని 23 ఐఐటీల్లో గత విద్యా సంవత్సరం (2020-21)లో ఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతం కలుపుకొని మొత్తం 16,053 సీట్లున్నాయి. ఈసారి ఒక్కో కొత్త కోర్సులో 40 నుంచి 50 సీట్ల చొప్పున దాదాపు వెయ్యి వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2021-22లో బీటెక్‌, బీఎస్‌ సీట్లు 17 వేలకు చేరుకుంటాయని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలంటే ఆయా ఐఐటీల్లో అకడమిక్‌ సెనెట్‌ ఆమోదం పొందడం తప్పనిసరి.

కొత్త విద్యా సంవత్సరంలో సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ఆయా ఐఐటీలు సీట్ల వివరాలను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించే ఐఐటీకి అందజేయాలి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని ఐఐటీలు అకడమిక్‌ సెనేట్లలో ఆమోదం పొందగా...ఈ నెలలో అన్ని ఐఐటీలు ఆ సమావేశాలు నిర్వహించిన అనంతరం వాటిని వెల్లడించనున్నాయి. మొత్తం బీటెక్‌ సీట్లలో కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు విద్యార్థులే 20-25 శాతం సీట్లను దక్కించుకుంటున్నారు.

ఆన్‌లైన్‌, మార్కెట్‌ డిమాండ్‌ ఆధారంగా..

జాతీయ నూతన విద్యా విధానం అమలులో భాగంగా ఆన్‌లైన్‌, ఈ- కోర్సులతోపాటు రెండు మూడు రంగాల్లోని సబ్జెక్టులను కలిపి అందించే మల్టీ డిసిప్లినరీ కోర్సులను పెద్ద ఎత్తున ప్రవేశపెడుతున్నారు. ఐఐటీ కాన్పుర్‌లో ఎంటెక్‌లో కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఎంబీఏలో పవర్‌ సెక్టార్‌ రెగ్యులేషన్‌, ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌; కమోడిటీ మార్కెట్స్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అనే ఆన్‌లైన్‌ కోర్సులు రానున్నాయి. వీటిలో ఇప్పటికే వివిధ పరిశ్రమల్లో పనిచేసే వారు కూడా ప్రవేశాలు పొందొచ్చు.

ఈసారి ప్రస్తుత సమస్యలకు పరిష్కారంతో పాటు భవిష్యత్తులో వేటికి డిమాండ్‌ పెరగనుందో వాటిపై కోర్సులను అందించేందుకు ఐఐటీలు ఆసక్తి చూపుతున్నాయి. కాలుష్యానికి పరిష్కారంగా విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ వృద్ధిచెందుతోంది. అందుకే ఐఐటీ హైదరాబాద్‌ ఎలక్ట్రికల్‌ వెహికల్‌పై ఎంటెక్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తోంది. కరోనా నేపథ్యంలో ఐఐటీ బొంబాయి హెల్త్‌కేర్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ కోర్సుకు శ్రీకారం చుడుతోంది. కొత్తవే కాకుండా ఉన్న కోర్సుల్లోనే సిలబస్‌లో మార్పులు చేసి పలు కొత్త అంశాలను మిళితం చేసి అందించనున్నారు.

కొత్త కోర్సులు

ఈసారి అధికంగా కొత్త కోర్సులు..

వచ్చే విద్యా సంవత్సరం ఐఐటీ హైదరాబాద్‌లో కొత్తగా జనరల్‌, మల్టీ డిసిప్లినరీ, ఆన్‌లైన్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఈసారి జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను వివిధ ఐఐటీలు ప్రవేశపెట్టే సన్నాహాల్లో ఉన్నాయి. అకడమిక్‌ సెనేట్‌లో ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తాం.

- ఆచార్య బీఎస్‌ మూర్తి, సంచాలకుడు, ఐఐటీ హైదరాబాద్‌

ఇదీ చూడండి:

అమూల్ కోసం ప్రభుత్వ సోమ్ము వాడొద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.