ETV Bharat / city

దేశంలో 19 మందికి కొత్త రకం కరోనా.. తెలంగాణ- 2, ఏపీ -1 - భారత్ లో కొత్త రకం కరోనా కేసులు

మనదేశంలో 18 నుంచి 19 కొత్తరకం కరోనా కేసులు అధికారులు గుర్తించినట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు వెల్లడించాయి. అయితే కొత్త వైరస్‌ సోకిన వారిలో ఆరుగురిని గుర్తించామన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.. తెలంగాణలో రెండు, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు.. కర్ణాటకలో ముగ్గురుకి కొత్త రకం కరోనా ఉన్నట్లు తెలిపారు. వ్యాప్తి నియంత్రణపై ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖల కార్యాచరణ రూపొందించాయి.

uk tension
uk tension
author img

By

Published : Dec 30, 2020, 7:04 AM IST

బ్రిటన్‌లో వెలుగుచూసి ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా కొత్త రకం వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని పరిశోధన సంస్థలు, వైద్యారోగ్యశాఖవర్గాలు ధ్రువీకరించాయి. నమూనాలు పరీక్షించే కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్టు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు ప్రకటించాయి. అయితే కొత్త వైరస్‌ సోకిన వారిలో ఆరుగురిని గుర్తించినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. మిగిలిన వారు ఎవరు? ఎక్కడి వారనే విషయాన్ని వెల్లడించలేదు. బెంగళూరులోని నిమ్హాన్స్‌ ప్రయోగశాలలో 3, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 2, పుణెలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణయినట్టు కేంద్రం మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం బాధితులను ఆయా రాష్ట్రాల్లో ఐసొలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. అయితే తాము 3 యూకే వైరస్‌ కేసులను గుర్తించినట్లు సీసీఎంబీ ఇచ్చిన ప్రకటనలో ఉండటం గమనార్హం.

వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి, క్వారంటైన్‌కు పంపేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించింది. ఏపీ సహా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూకే వైరస్‌ కేసులు నిర్ధారణవడంతో ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికాల్లో కరోనా కొత్తరకం విజృంభిస్తోంది. అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త రకం వైరస్‌ పాత దానితో పోలిస్తే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భారత్‌ సహా పలు దేశాలు యూకేకు విమానసర్వీసులు నిలిపివేశాయి.

‘నవంబరు 25 నుంచి డిసెంబరు 23 అర్ధరాత్రిలోగా భారత్‌కు చేరుకున్న 33 వేలమంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించారు. వీరిలో 114 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. బాధితులకు సోకింది కొత్త రకమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు వారి రక్తనమూనాలను దేశంలోని పది వైరాలజీ ప్రయోగశాలలకు పంపించాం. తాజాగా ఈ ఫలితాలు వెలువడగా.. యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్త రకం వైరస్‌ను గుర్తించాం’ అని ఐసీఎంఆర్‌ సలహాదారు డాక్టర్‌ సునీలా గార్గ్‌ ‘ఈటీవీ భారత్‌’కు వెల్లడించారు. యూకే నిర్వహించిన పరిశోధనల్లో కొత్త వైరస్‌ 23 ఉత్పరివర్తనాలు చెందినట్టు తేలిందని, కొత్త పరివర్తనాన్ని ఎన్‌501వైగా గుర్తించారని వివరించారు. దీని వ్యాప్తిని వైద్యారోగ్యశాఖ నిత్యం పర్యవేక్షిస్తోందని, వైరస్‌ సోకిన అందర్నీ గుర్తించడంతోపాటు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, జర్మనీ, కెనడా, జపాన్‌, లెబనాన్‌, సింగపూర్‌ ఈ కొత్త రకం వైరస్‌ కేసులు గుర్తించారు.

రాజమహేంద్రవరం మహిళకు కొత్త కరోనా

బ్రిటన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళలో మాత్రమే కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించామని, ఆమె నుంచి ఇతరులకు సోకలేదని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. ఆమె కుమారుడికి నెగెటివ్‌ వచ్చిందని, ఈ వైరస్‌ రాష్ట్రంలో విస్తరించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ‘బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1,423 మందిలో 1,406 మందిని గుర్తించాం. వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. 1,406 మందితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 6,364 మందికి పరీక్షలు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ 24 మంది నమూనాలను సీసీఎంబీకి పంపగా రాజమహేంద్రవరానికి చెందిన మహిళకు యూకే స్ట్రెయిన్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మిగతా 23 మందికి సంబంధించిన నివేదికలు సీసీఎంబీ నుంచి రావాల్సి ఉంది’ అని భాస్కర్‌ వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓ మహిళకు వైరస్‌

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓ మహిళకు ఈ వైరస్‌ సోకినట్టు సీసీఎంబీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఈ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి వరంగల్‌ వాసిలో కొత్త వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణయింది.

తమిళనాడు, కర్ణాటకలలో...

* యూకే నుంచి తమిళనాడుకు వెళ్లిన ఒకరికి కొత్తరకం కరోనా వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ చెన్నైలో వెల్లడించారు.

* బెంగళూరులోని ఉత్తరహళ్లి వాసులు ఇద్దరు, జేపీ నగరలోని ఒకరికి కొత్త వైరస్‌ సోకినట్లు కర్ణాటక వైద్యారోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఉత్తరహళ్లికి చెందిన బాధితుల్లో 34 ఏళ్ల మహిళ, ఆమె ఆరేళ్ల కుమార్తె ఉందని, మహిళ భర్తకు కూడా పాజిటివ్‌గా తేలినా యూకే స్ట్రెయిన్‌ నిర్ధారించాల్సి అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.