ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి ప్రత్యామ్నాయ కేలండర్‌ను రూపొందిస్తోంది. జాతీయస్థాయిలో ఎన్‌సీఈఆర్టీ విడుదల చేసిన కేలండర్‌ను తెలుగులోకి అనువదిస్తున్నారు. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థుల్లో మానసికోల్లాసం, వారిలోని ఒత్తిడి దూరం చేయడానికి కొన్ని పాఠ్యాంశాలను రూపొందించారు. అన్‌లాక్-2లో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నెలాఖరు వరకు పాఠశాలలను తెరవకూడదు. దీంతో ఇంటివద్ద ఉండే పిల్లలకు మెటీరియల్‌ను సరఫరా చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.
ఇదీ చదవండి: