రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్‌ఛైర్మన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన 2005 పుర, నగరపాలక ఎన్నికల చట్టంలోని పలు నిబంధనలను సవరిస్తూ పురపాలక శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు వెలువడటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారు చేయనుంది. ఉన్న పాలకవర్గ సభ్యుల్లో ఒకరిని రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్‌ఛైర్మన్‌గా మిగతా సభ్యులు ఎన్నుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:
AP - TS Water Disputes: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయండి: కేంద్రమంత్రికి సీఎం లేఖ