తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,14,260 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 691 కొత్త కేసులు (corona cases) నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులతో కలిపి మొత్తం సంఖ్య 6,38,721 కి చేరింది.
మహమ్మారి బారి నుంచి మరో 565 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 6,25,042 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇవాళ మరణించిన ఐదుగురితో కలిపి మొత్తం సంఖ్య 3,771కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా కేసుల్లో అత్యధికంగా 85 కేసులు జీహెచ్‌ఎంసీలో నమోదయ్యాయి. జిల్లాల వారీగా వచ్చిన కేసులను పరిశీలిస్తే... ఇలా ఉన్నాయి.
జిల్లాలు | కేసులు |
ఆదిలాబాద్ | 02 |
భద్రాద్రి కొత్తగూడెం | 23 |
జగిత్యాల | 26 |
జనగామ | 10 |
జయశంకర్ భూపాలపల్లి | 09 |
జోగులాంబ గద్వాల్ | 03 |
కామారెడ్డి | 00 |
కరీంనగర్ | 55 |
ఖమ్మం | 56 |
కుమురంభీం ఆసిఫాబాద్ | 07 |
మహబూబ్ నగర్ | 08 |
మహబూబాబాద్ | 19 |
మంచిర్యాల | 37 |
మెదక్ | 01 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి | 30 |
ములుగు | 09 |
నాగర్ కర్నూల్ | 05 |
నల్గొండ | 38 |
నారాయణ పేట్ | 02 |
నిర్మల్ | 03 |
నిజామాబాద్ | 07 |
పెద్దపల్లి | 42 |
రాజన్న సిరిసిల్ల | 19 |
రంగారెడ్డి | 29 |
సంగారెడ్డి | 07 |
సిద్దిపేట | 18 |
సూర్యాపేట | 47 |
వికారాబాద్ | 05 |
వనపర్తి | 09 |
వరంగల్ రూరల్ | 25 |
వరంగల్ అర్బన్ | 41 |
యాదాద్రి భువనగిరి | 14 |
జీహెచ్‌ఎంసీ | 85 |
ఇదీ చూడండి:
Night curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ