ETV Bharat / city

NDB: మీరు ఖర్చు చేశాకే... మేం చెల్లిస్తాం! - ఏపీ వార్తలు

రాష్ట్రంలో ఏక వరుస ఉన్న రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చిపడింది. కేంద్రంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ (DEA) ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎన్‌డీబీ... రుణం కింద తాము ఇస్తున్న నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రత్యేక ఖాతా తెరవాలంటూ మొదట సూచించింది. ఇంతలోనే ‘‘మేం రుణం కింద ఇచ్చే 70% నిధులను తొలుత ప్రభుత్వం ఖర్చు పెట్టండి. వాటిని తర్వాత తిరిగి చెల్లింపులు (రీయంబర్స్‌) చేస్తాం’’ అని మెలికపెట్టడం గమనార్హం.

NDB
NDB
author img

By

Published : Oct 5, 2021, 7:08 AM IST

జిల్లా కేంద్రాలు, రాష్ట్ర రహదారులతో మండల కేంద్రాలను అనుసంధానించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై ప్రతిష్టంభన ఏర్పడింది. రూ.6400 కోట్ల న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (NDB) రుణంతో రాష్ట్రంలో ఏక వరుస ఉన్న రహదారుల విస్తరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చిపడింది. కేంద్రంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ (డీఈఏ) ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎన్‌డీబీ... రుణం కింద తాము ఇస్తున్న నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ప్రత్యేక ఖాతా తెరవాలంటూ మొదట సూచించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. ఇంతలోనే ‘‘మేం రుణం కింద ఇచ్చే 70% నిధులను తొలుత మీరే(రాష్ట్ర ప్రభుత్వం) ఖర్చు చేయండి. వాటిని తర్వాత తిరిగి చెల్లింపులు (రీయంబర్స్‌) చేస్తాం’’ అని మెలికపెట్టడం గమనార్హం.

ఇవీ వివరాలు....

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చాలావరకు మండల కేంద్రాల నుంచి రాష్ట్ర, జిల్లా రహదారుల వరకు ప్రస్తుతం ఏక వరుస రోడ్లు ఉన్నాయి. మండలాల కేంద్రాల మధ్య, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి కూడా ఒక వరుస రోడ్లే ఉన్నాయి. ఇలా 2,500 కి.మీ. మేర ఉన్న రోడ్లన్నింటినీ రెండు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు కోసం 2019లో రుణం మంజూరుకు ఎన్‌డీబీ అంగీకారం తెలిపింది. ఇందులో ఎన్‌డీబీ 70%, రాష్ట్రం 30% వెచ్చించాల్సి ఉంది. తొలి దశలో రూ.3,013.86 కోట్ల వ్యయంతో 1,243.53 కి.మీ. మేర విస్తరణ, వివిధ వంతెనల పునర్నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక జిల్లాలోని పనులన్నీ ఒకే ప్యాకేజీ కింద పరిగణించి రూ.1,860 కోట్ల విలువైన సివిల్‌ పనులకు టెండర్లు పిలిచి, గుత్తేదారు సంస్థలతో ఈ ఏడాది మార్చిలో ఒప్పందం చేసుకున్నారు. 10% మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కోసం గుత్తేదారు సంస్థలు ఎదురు చూస్తున్నారు. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులు ఎన్‌డీబీని సంప్రదించడంతో వారు కొత్త షరతును విధించారు. దీంతో ఎన్‌డీబీ ప్రాజెక్టు ముందుకుసాగడం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.

యూసీ చూపిస్తేనే... తిరిగి చెల్లింపు

రహదారుల పనులు చేసిన గుత్తేదారు సంస్థలకు.. ఎన్‌డీబీ రుణవాటా కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే చెల్లించాలని ఎన్‌డీబీ సూచించింది. ఇలా చేసిన వాటికి వినియోగ ధ్రువపత్రం (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌-యూసీ) అందజేస్తే... ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తామంది. ఈ నిర్ణయంతో ఎన్‌డీబీ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. గత ఏడాది చేసిన రోడ్ల మరమ్మతులకే పూర్తిగా చెల్లింపులు చేయలేదని, కేంద్రం రీయంబర్స్‌ చేసే సీఆర్‌ఎఫ్‌ పనుల బిల్లులూ బకాయి ఉన్నాయని, గతంలో ప్రారంభించిన పలు రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు సైతం నిధులివ్వక ఎక్కడికక్కడ నిలిచిపోయాయని గుత్తేదారులు పేర్కొంటున్నారు. తక్కువ మొత్తాలకే బిల్లులను చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎన్‌డీబీలో ఒక్కో జిల్లాలో రూ.100 నుంచి రూ.200 కోట్ల మేర చెల్లింపులు ఎలా చేయగలరని ఎన్‌డీబీ పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థలు సందేహాలు వ్యక్తంచేస్తున్నాయి.

ఆరు నెలల్లో 10% పనులు ఏవీ?

ఈ ప్రాజెక్టులో రహదారుల పనులను 24 నెలల్లో గుత్తేదారులు పూర్తి చేయాల్సి ఉంది. దీనిని నాలుగు భాగాలు(మైల్‌స్టోన్స్‌)గా విభజించారు. తొలి భాగాన్ని 180 రోజుల్లో (ఆరు నెలల్లో) 10%, ఏడాదిలో 30%, 550 రోజుల్లో 60%, రెండేళ్లలో 100% పనులు చేయాలి. ఇప్పటికి తొలి మైల్‌స్టోన్‌ గడువు ముగిసింది. అంటే అన్ని జిల్లాల్లో 10% పూర్తికావాల్సి ఉండగా, ఎక్కడా ఒక్క రహదారి పని కూడా చేయలేదు. మరోవైపు ఎన్‌డీబీతో రుణ ఒప్పంద సమయంలో... ముందుగా నిధులు ఇస్తుందా, రీయంబర్స్‌ చేస్తుందా? అనేది పేర్కొనలేదని ఓ కీలక ఇంజినీరు తెలిపారు. దీంతో రీయంబర్స్‌ విధానాన్ని ఆ బ్యాంకు పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. గుత్తేదారు సంస్థలు పనులు చేస్తే ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు చేస్తుందని హామీ ఇస్తామని, పనులు ఆరంభించేలా చూస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: polavaram:పోలవరం నిధులపై మళ్లీ కొర్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.