ETV Bharat / city

lepakshi lands issue: లేపాక్షి భూముల్లో జగన్నాటక సూత్రధారులకు ఎదురుదెబ్బ! - CLT cancels auction Lepakshi Knowledge Hub

Lepakshi Knowledge Hub: ప్రజలకు సంబంధించిన వేల ఎకరాల లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూములతో ముడిపడి ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియ అమలులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దివాలా ప్రక్రియలో కంపెనీని రూ.500 కోట్లకు దక్కించుకున్న ఎర్తిన్‌ కన్సార్షియం ప్రస్తుతానికి రంగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఎర్తిన్‌ నుంచి తమకు డబ్బు సకాలంలో అందలేదని.. మరోసారి కొత్తగా దివాలా ప్రక్రియను చేపట్టేందుకు అనుమతివ్వాలంటూ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ‘రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌’ చేసిన విజ్ఞప్తిని ఆమోదిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ¨) హైదరాబాద్‌ శాఖ ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వెలువడిన ఆ ఉత్తర్వుల ప్రకారం... ఇందూను తీసుకునేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి మరోసారి బిడ్లు ఆహ్వానిస్తారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దివాలా ప్రక్రియ పేరుతో కొల్లగొడుతున్న వైనాన్ని ‘దివాలా మాటున దోపిడీ’ శీర్షికతో ‘ఈనాడు’ గత నెల 23న సమగ్ర కథనంతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

lepakshi lands issue
లేపాక్షి భూములకోసం నిరసనలు
author img

By

Published : Sep 13, 2022, 8:27 AM IST

NCLT cancels auction of Lepakshi Knowledge Hub land: ప్రజలకు సంబంధించిన వేల ఎకరాల లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూములతో ముడిపడి ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియ అమలులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దివాలా ప్రక్రియలో కంపెనీని రూ.500 కోట్లకు దక్కించుకున్న ఎర్తిన్‌ కన్సార్షియం ప్రస్తుతానికి రంగం నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఎర్తిన్‌ నుంచి తమకు డబ్బు సకాలంలో అందలేదని.. మరోసారి కొత్తగా దివాలా ప్రక్రియను చేపట్టేందుకు అనుమతివ్వాలంటూ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న ‘రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌’ చేసిన విజ్ఞప్తిని ఆమోదిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ¨) హైదరాబాద్‌ శాఖ ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వెలువడిన ఆ ఉత్తర్వుల ప్రకారం... ఇందూను తీసుకునేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి మరోసారి బిడ్లు ఆహ్వానిస్తారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దివాలా ప్రక్రియ పేరుతో కొల్లగొడుతున్న వైనాన్ని ‘దివాలా మాటున దోపిడీ’ శీర్షికతో ‘ఈనాడు’ గత నెల 23న సమగ్ర కథనంతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లోకి నాడు డబ్బులు కూడా వెళ్లాయని తెల్చిన సీబీఐ

ఉమ్మడి రాష్ట్రానికి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమకు ఎంతో కావలసిన ఇందూ గ్రూపునకు లేపాక్షి నాలెడ్జి హబ్‌ పేరుతో అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూములను సంతర్పణ చేశారు. ఇదంతా పేద ప్రజల నుంచి సేకరించింది. ఆ భూములను చౌకగా కట్టబెట్టినందుకు ఇందూ నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లోకి నాడు డబ్బులు కూడా వెళ్లాయని సీబీఐ తేల్చింది. లేపాక్షి భూములను తాకట్టు పెట్టి రూ.4,138 కోట్లు అప్పులు తీసుకున్న ఇందూ కంపెనీ వాటిని బ్యాంకులకు తిరిగి కట్టలేదు. బ్యాంకుల ఫిర్యాదుతో దివాలా ప్రకియ మొదలైంది.

లేపాక్షికి చెందిన 4,191 ఎకరాల భూమి సహా హైదరాబాద్‌లోని అనేక విలువైన ఆస్తులను కేవలం రూ.500 కోట్లకే జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి కొడుకు నరేన్‌ రామానుజులరెడ్డికి సంబంధించిన ఎర్తిన్‌ కన్సార్షియం దివాలా ప్రక్రియ ద్వారా సొంతం చేసుకునే వ్యవహారం కొంతకాలం కిందట మొదలైంది. ‘ఈనాడు’ దీన్ని వెలుగులోకి తేవడంతో ప్రజల్లో విస్తృత చర్చ జరిగింది. ఇది దారుణమని, ప్రజలకు చెందిన వేల కోట్ల భూములు వారికే దక్కాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దివాలా ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది.

రూ.50 కోట్లే చెల్లింపు

ఇందూ వ్యవహారంలో బిడ్‌ పొందిన ఎర్తిన్‌ కన్సార్షియం తాను చెల్లించాల్సిన రూ.500 కోట్లలో ఇప్పటి వరకు రూ.50 కోట్లు మాత్రమే చెల్లించింది. బిడ్డర్‌ నుంచి సకాలంలో డబ్బులు అందనందున, అది ఇచ్చిన హామీలను నెరవేర్చనందున దివాలా ప్రక్రియను మరోసారి చేపట్టి 60 రోజుల్లో పూర్తి చేస్తామని రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ కోరగా ఎన్‌సీఎల్‌టీ అంగీకరించింది. డబ్బుల చెల్లింపునకు మూణ్నెల్ల గడువు పొడిగిస్తూ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏప్రిల్‌ 13న ఇచ్చిన ఉత్తర్వులకూ కాలం చెల్లినందున.. బిడ్డర్‌ అదనపు గడువు కోరే హక్కునూ కోల్పోయారని ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. లిక్విడేషన్‌ ప్రక్రియకు అనుమతించే ముందు తమ వాదన వినాలని ఎర్తిన్‌ దాఖలు చేసిన పిటిషన్‌నూ కొట్టివేసింది.

రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ అంటే?

ఏదైనా కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తే ఎన్‌సీఎల్‌టీ దానిని నిర్వహించడానికి ఒక నిపుణుణ్ని నియమిస్తుంది. ముందుగా ఒక నిపుణుని పేరు సూచించమని ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంకరప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ)ను ఎన్‌సీఎల్‌టీ కోరుతుంది. ఐబీబీఐ సూచించిన పేరును రుణదాతల కమిటీ కూడా ఆమోదించాక ఖరారు చేస్తుంది. అప్పటి నుంచి ఆ నిపుణుణ్ని సంబంధిత కంపెనీ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు.

భూముల్ని రైతులకు ఇచ్చేయండి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమం మొదలైంది. సీపీఐ, ఎమ్మార్పీఎస్‌, రైతు సంఘం నాయకులు ఇందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 19 వరకు ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఏపీఐఐసీ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు బేకరి గంగాధర్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వేమనారాయణ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం తక్కువ ధరకు 8,848 ఎకరాల భూములు కోనుగోలు చేసిందని తెలిపారు. 15 ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. తిరిగి రైతులకే భూములు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 4,000 కోట్ల రుణం తీసుకున్నారని, ప్రస్తుతం నష్టాల పేరుతో రూ.500 కోట్లకు ముఖ్యమంత్రి జగన్‌ సమీప బంధువుకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. అనంతరం కలెక్టర్‌ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసి, రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ధారాదత్తం చేస్తే ఊరుకోం

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూములను నష్టాల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌ సమీప బంధువుకు చౌకగా కట్టబెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు. ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు పంపిణీ చేయాలని కోరారు. సోమవారం అనంతపురంలోని ఏపీఐఐసీ జెడ్‌ఎం కార్యాలయం ముందు సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌, రైతు సంఘం జిల్లా సహాధ్యక్షుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.