ETV Bharat / city

ముగిసిన నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు - nayani narsimha reddy death

కార్మిక నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో ముగిశాయి. నాయిని కుమారుడు దేవేందర్​ రెడ్డి ఆయన పార్ధివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

nayini narsimha reddy funeral finished
ముగిసిన నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు
author img

By

Published : Oct 22, 2020, 7:51 PM IST

ముగిసిన నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మహాప్రస్థానంలో ముగిశాయి. మంత్రుల నివాస సముదాయం నుంచి ప్రారంభమైన నాయిని అంతిమయాత్ర... బంజారాహిల్స్ రోడ్ నంబరు 12, ఫిలింనగర్ మీదుగా సాగింది. నాయిని అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్, ఈటల, తలసాని, ఇతర మంత్రులు పాల్గొన్నారు. సహచరులు, పార్టీ శ్రేణులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు... నాయిని నివాసంలో పార్ధివదేహానికి పలువురు నేతలు, అధికారులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. నాయిని మృతి తెలంగాణ రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటన్నారు.

నాయిని కుమారుడు దేవేందర్​ రెడ్డి ఆయన పార్ధివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.