ETV Bharat / city

NGT: ఫార్మా కంపెనీల కాలుష్యంపై ఎన్జీటీ సీరియస్​ - national green tribunal fire on pharma industries pollution

NGT ON PHARMA POLLUTION: తెలంగాణలో ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్​ గ్రీన్​ ట్రైబ్యునల్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

NGT
NGT
author img

By

Published : Feb 3, 2022, 8:34 PM IST

ఫార్మా కంపెనీల కాలుష్యంపై నేషనల్​ గ్రీన్​ ట్రైబ్యునల్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యంపై నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారును ఆదేశించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ శాఖ కమిషనర్​, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్​కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్​ కె.రామకృష్ణ, ఎక్స్​పర్ట్​ మెంబర్​ సత్యగోపాల్​తో కూడిన ఎన్జీటీ బెంచ్​ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన నరేందర్​ రెడ్డి ఫిర్యాదు మేరకు గ్రీన్​ ట్రెబ్యునల్​ విచారణ చేపట్టింది.

కాలుష్యంపై సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని నరేందర్​ రెడ్డి తన పిటిషన్​లో పేర్కొన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఈ పిటిషన్​పై తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి ఎన్టీటీ వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

Flag Hoisting At Jinnah Tower: మతాల మధ్య చిచ్చుపెట్టడం సిగ్గుచేటు: హోం మంత్రి సుచరిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.