ఏపీ పోలీసు యాప్‌కు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల కృషి కారణంగానే ఈ అవార్డు వచ్చినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఏపీ పోలీసు యాప్ ద్వారా ప్రజలకు నేరుగా 87 సేవలందిస్తున్నామన్నారు. మహిళా భద్రత కోసం చాలా కార్యక్రమాలు చేపట్టామని...దిశా చట్టం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. మహారాష్ట్ర బృందం రాష్ట్రానికి వచ్చి దిశా చట్టం వివరాలు తెలుసుకుందని డీజీపీ ఈ సందర్భంగా చెప్పారు.
వారి కుటుంబాలకు సెల్యూట్..
2020లో కొవిడ్-19 కారణంగా... పోలీసులు చాలా సవాళ్లు, ఆటుపోట్లు ఎదుర్కోన్నారని డీజీపీ తెలిపారు. 14 వేలమంది పోలీసులు కొవిడ్ బారిన పడగా...109 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నారని డీజీపీ స్పష్టం చేశారు.