ఇంటి పన్నులు పెరగాలనుకుంటే పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ఓటేయాలని తెదేపా ప్రథాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం లోకేశ్ సమక్షంలో సత్తెనపల్లి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మని ఆత్కూరి నాగేశ్వరరావు, వైకాపా గుంటూరు ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కంచర్ల దేవదానం తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు.
'తెదేపా హయాంలో ఎస్సీలపై దాడి చేసేందుకు ఎవరైనా భయపడేవారు. జగన్ పాలనలో మాత్రం వారిపై దమనకాండ కొనసాగుతోంది. కుడిచేత్తో వంద రూపాయలిస్తూ ఎడంచేత్తో వెయ్యి రూపాయలు కొట్టేస్తున్నారు. రూ. వేల కోట్ల అప్పల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేశారు'- లోకేశ్
ఇదీ చదవండి: