ETV Bharat / city

మహిళల రక్షణ చర్యలకు సమయం ఇవ్వలేరా..? లోకేశ్ - ఒంగోలులో మహిళపై హత్యాచారం వార్తలు

సీఎం జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శలు గుప్పించారు. జన్మదినోత్సవం పేరిట భజన కార్యక్రమాలకు ఇస్తున్న సమయం మహిళల రక్షణ చర్యలకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఒంగోలు ఘటనలో నిజానిజాలను వెలికితీసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

nara-lokesh
nara-lokesh
author img

By

Published : Dec 22, 2020, 2:39 AM IST

  • ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరిని అత్యంత దారుణంగా సజీవ దహనం చేస్తే స్పందించే హృదయం,సమయం ముఖ్యమంత్రి @ysjagan గారికి లేదు.
    ఈ ఘటన ద్వారా మహిళల రక్షణ పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు అనే విషయం మరోసారి బయటపడింది.(1/4) pic.twitter.com/W9DLIQMz7y

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి... జన్మోదినోత్సవం పేరిట భజన కార్యక్రమాలకు ఇస్తున్న సమయం మహిళల రక్షణ చర్యలకు ఇవ్వకపోవడం బాధకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఒంగోలులో దివ్యాంగురాలు భవనేశ్వరిని అత్యంత దారుణంగా సజీవ దహనం చేస్తే స్పందించే హృదయం ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. ఈ ఘటనతో మహిళల రక్షణ పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదన్నది మరోసారి బయటపడిందని ధ్వజమెత్తారు.

ఒంగోలు దుర్ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలన్న లోకేశ్‌... నిజానిజాలను వెలికితీసి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు,హత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 18 నెలల పాలనలో 310 ఘటనలు జరిగినట్లు ఆరోపించారు. దిశ చట్టం ద్వారా ఏ మహిళకు న్యాయం జరగలేదన్న ఆయన... ఒక్క మృగాడికి కూడా శిక్ష పడలేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి
'ఎమ్మెల్యే నా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.