వైకాపా ప్రభుత్వం ప్రజలకు కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్ పేదలకు ఇచ్చే రేషన్ సరకుల ధరలను పెంచడమే దానికి నిదర్శనమని లోకేశ్ అన్నారు. కందిపప్పుపై కిలోకు రూ.27, పంచదారపై కిలోకు రూ.14 ఒకేసారి పెంచి పేదలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల సంవత్సరానికి పేదలపై రూ.600 కోట్లు భారం పడుతుందని వివరించారు.
ఇదీ చదవండి: పర్చూరులో పాముల సయ్యాట