సామాజిక మాధ్యమాల్లో విమర్శలకే భయపడుతున్న ప్రభుత్వం... ప్రజాగ్రహాన్ని ఎలా తట్టుకుంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. తెదేపా అభిమాని అవినాష్ అరెస్టును లోకేశ్ ఖండించారు. భావప్రకటనా స్వేచ్ఛను అణిచివేసేలా వ్యవహరించడం మానవ హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించారు.
వైకాపా నేతల వివాదస్పద వ్యాఖ్యలపై తెదేపా ఫిర్యాదు చేసినప్పుడు... భావప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోలేమని పోలీసులు చెప్పిన విషయం గుర్తుచేశారు. చట్టం అందరికీ సమానమేనన్న విషయాన్ని పోలీసులు మరిచిపోతున్నారని వ్యాఖ్యానించారు. తెదేపా సామాజిక మాధ్యమ వాలంటీర్లకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి