తెదేపా నిర్వహిస్తున్న మాక్ అసెంబ్లీలో.. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. పరీక్షల వాయిదా సరిపోదన్న ఆయన.. కరోనా తీవ్రత దృష్ట్యా రద్దే సబబని పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించే పక్షంలో పరీక్షా కేంద్రాలే సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసుకుని.. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: