ETV Bharat / city

'పేదల ఇళ్లు కూల్చే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు?' - ఆత్మకూరులో ఇళ్ల కూర్చివేతపై తెదేపా ఆగ్రహం

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పేదల ఇళ్లను కూల్చడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను నడి రోడ్డు మీదకి నెట్టేశారని ఆరోపించారు.

nara lokesh comments on mla alla rama krishna reddy

author img

By

Published : Mar 22, 2021, 4:51 PM IST

  • మంగళగిరి నియోజకవర్గం, ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారు. ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు. pic.twitter.com/1lMiZTHSAz

    — Lokesh Nara (@naralokesh) March 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పేదల ఇళ్లను కూల్చడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపం ఎమ్మెల్యేను ఊరికే వదలదని దుయ్యబట్టారు.

సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను నడి రోడ్డు మీదకి నెట్టేశారని లోకేశ్ ఆరోపించారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కట్టని వైకాపా ప్రభుత్వానికి.. వారు కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చే చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. పేదలకు న్యాయం జరిగే వరకూ బాధితుల పక్షాన తెదేపా పోరాడుతుందన్నారు.

ఇదీ చదవండి:

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.