రిజర్వ్ బ్యాంకు ఖజానా ఖాళీ అయ్యేంతగా అప్పులు చేస్తున్న జగన్ ప్రభుత్వం... రైతులకు రూపాయి కూడా సాయం చేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో మెట్ట రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, వేరుశనగ, మిర్చి, ఉల్లి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
తెస్తున్న వేల కోట్ల రూపాయలు అప్పులు ఎటుపోతున్నాయో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నష్టపోయిన రైతులను గుర్తించి, వారిని ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభం