జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలకు నిత్యావసరమైన పాలను అందుబాటులో ఉంచుతామని... హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి తెలిపారు. పాల సేకరణ నుంచి వినియోగదారులకు చేరే వరకు కరోనా నివారణ చర్యలన్నీ సమర్థంగా పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి థర్మల్ స్క్రినింగ్ తర్వాతే విధుల్లోకి వస్తారని వెల్లడించారు. వినియోగదారులు సామాజిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ఉండి జనతా కర్ఫ్యూకి మద్దతు ఇవ్వాలని కోరారు. పాలు, పెరుగు ప్యాకెట్లు, ఇతర ఆహార ప్యాకెట్ల వినియోగానికి ముందు నీటితో కడిగి కత్తిరించాలని బ్రాహ్మణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :