ETV Bharat / city

విచారణకు హాజరు కావాల్సిందే: తెలంగాణ హైకోర్టు - హైకోర్టు వార్తలు

తెలంగాణలోని సంగారెడ్డి అదనపు కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ను హైకోర్టు హెచ్చరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడి.. అందులో శిక్షపడితే మొక్కుబడి క్షమాపణలతో అప్పీలు దాఖలు చేస్తే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.

విచారణకు హాజరు కావాల్సిందే: తెలంగాణ హైకోర్టు

author img

By

Published : Mar 18, 2021, 11:41 AM IST

కోర్టు ధిక్కరణకు పాల్పడి అందులో శిక్షపడితే మొక్కుబడి క్షమాపణలతో అప్పీలు దాఖలు చేస్తే అనుమతించే ప్రసక్తే లేదంటూ తెలంగాణ హైకోర్టు.. సంగారెడ్డి జిల్లా అధికారులను హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్న సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీఓ ఎస్‌.శ్రీను, తహసీల్దార్‌ యు.ఉమాదేవి తీరును తప్పుబట్టింది. కోర్టు ధిక్కరణ అప్పీలులో హాజరుకావాల్సి ఉండగా ఎందుకు రాలేదని ప్రశ్నించింది. వచ్చే విచారణకు హాజరుకావాలంటూ విచారణను ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

సంగారెడ్డి జిల్లా కంది - చిమ్నాపూర్‌ గ్రామంలో కొనుగోలు చేసిన భూమికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంతో ఇ.జె.డేవిడ్‌ తదితరులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి అదనపు కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌లకు రెండు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా, ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలంటూ తీర్పు వెలువరించారు.

దీనిని సవాలు చేస్తూ అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఉత్తర్వులను అధికారులు గౌరవించకపోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. కోర్టు ధిక్కరణను సమర్థించుకుంటూ చెప్పాల్సిన కారణాలు చెబుతూనే తిరిగి మొక్కుబడిగా క్షమాపణ చెబితే వాటిని అంగీకరించబోమంది. ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కొంటున్నారో చెప్పాలంది.

ఇదీ చదవండి:

ఎమ్మెల్సీ తొలి రౌండ్‌ ఫలితాలు విడుదల... కొనసాగుతోన్న లెక్కింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.