Munugode By poll Schedule: తెలంగాణలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. మునుగోడులో నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించి.. 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉపఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
ఈ నెల 14 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు తేదీని ప్రకటించింది. 15న నామినేషన్ల పరిశీలన.. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. మునుగోడు సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. తక్షణమే మునుగోడులో ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది.
ఇవీ చదవండి: