రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కుప్పం పురపాలక సంఘంతో పాటు వివిధ నగరపాలక, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. ఉదయం 8 గంటలకు మొదలవనున్న కౌంటింగ్‌లో 1206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కుప్పంలో ఓ వార్డు ఏకగ్రీవమవగా.. 24 వార్డులకు జరిగిన ఎన్నికల లెక్కింపునకు ఎమ్ఎఫ్సీ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల్లూరు కార్పొరేషన్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపునకు డీకేడబ్ల్యూ కళాశాలలో సర్వం సిద్ధమైంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ, రాజంపేట పురపాలిక ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కమలాపురం బాలికల జడ్పీ ఉన్నత పాఠశాల, బోయనపల్లిలోని అన్నమాచార్య బీఈడీ కళాశాల, బద్వేలు బాలయోగి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
ఇదీ చదవండి: Amaravati Cases: అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీకి రాజధాని: హైకోర్టు సీజే