ETV Bharat / city

పటిష్ఠ ఏర్పాట్ల నడమ.. పుర పోలింగ్ - ఏపీ మున్సిపల్ ఎన్నికలు

పురపాలిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అలజడులకు పాల్పడే అవకాశముందన్న సమాచారంతో ముందస్తుగా కొందరు అనుమానితులను బైండోవర్‌ చేశారు.

ELECTION
ELECTION
author img

By

Published : Mar 10, 2021, 8:08 AM IST

Updated : Mar 10, 2021, 9:14 AM IST

పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సిబ్బందితో పటిష్ట బందోబస్తు మోహరించారు.

కడప జిల్లాలో...

కడప నగరపాలికతో పాటు 6 పురపాలికలకు పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా ప్రొద్దుటూరులో 32 వార్డులకు, అత్యల్పంగా రాయచోటిలో 3 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ మరింత పటిష్ట చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. రెండు వేల మంది సిబ్బందితో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిత్తూరు జిల్లాలో..

జిల్లాలో 2 నగరపాలక సంస్థలు, 4 పురపాలికలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో 137బూత్‌లు అత్యంత సమస్యాత్మకమైనవిగా... 97 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్​ ద్వారా ఎన్నికలు పోలింగ్ పర్యవేక్షిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు నగరపాలక సంస్థ, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ నందికొట్కూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 302 వార్డుల్లో 77 ఏకగ్రీవం కాగా....225 వార్డుల్లో పోలింగ్ జరగుతోంది. రెండు వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు పెట్టారు. అలజడి సృష్టించేందుకు అవకాశం ఉందన్న వారిని బైండోవర్‌ చేశారు.

అనంతపురం జిల్లాలో..

జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 358 వార్డులకు 21 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 337 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 864 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 62 సమస్యాత్మకమైన విగా గుర్తించారు. ఇక్కడ భారీగా బందోబస్తు పెట్టారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

జిల్లాలో ఏడు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అమలాపురం, రామచంద్రపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తునిలో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. మూడ నగర పంచాయతీలు ముమ్మిడవరం, ఏలేశ్వరం, గొల్లప్రోలులో ఎన్నికలు జరుగుతున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,100 మంది పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో..

పలాస - కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పురపాలికలు, పాలకొండ నగర పంచాయతీలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొత్తం 111 పోలింగ్‌ కేంద్రాల్లో 75 సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు ముందుగానే గుర్తించి.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా భద్రతా బలగాలను మోహరించారు.

విజయనగరం జిల్లాలో..

జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో పోలింగ్‌ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ మరింత పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి:

ఏలూరులో ఎన్నికలు జరుపుకోవచ్చు: హైకోర్టు డివిజన్ బెంచ్‌

Last Updated : Mar 10, 2021, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.