ETV Bharat / city

మున్సి 'పోల్స్': నామినేషన్ల దాఖలుకు నియమ నిబంధనలు - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వార్తలు

నేటి నుంచే పురపాలక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఒకే దశలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

మున్సి 'పోల్స్':
మున్సి 'పోల్స్':
author img

By

Published : Mar 10, 2020, 4:06 PM IST

Updated : Mar 11, 2020, 7:58 AM IST

పుర ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రతి జిల్లాల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తైంది. వారికి మార్గదర్శకాల కోసం బుక్​లెట్​లు అందజేశారు. ఎన్నికల ప్రక్రియ మొత్తానికి వారే బాధ్యత వహిస్తారు.

  • నామినేషన్లను ఇవాళ్టి నుంచి ఈనెల 13వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. భోజన విరామం లేదు.
  • జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. సహాయ ఎన్నికల అధికారులుగా కమిషనర్లు ఉంటారు. నామినేషను వేసే సమయంలో నలుగుర్ని మాత్రమేలోనికి అనుమతిస్తారు. అభ్యర్థితోపాటు ఇద్దరు ప్రతిపాదించేవారు, ఒక ఏజెంట్‌ వెంట ఉండవచ్చు.
  • నామినేషన్‌ దాఖలు కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఇతరులు ఉండాలి. ప్రతి కేంద్రంలో ఒక రిటర్నింగ్‌ అధికారి, ఇద్దరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు.
  • అభ్యర్థి స్థానిక సంస్థకు ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఇంటి పన్ను, కుళాయి పన్ను, దుకాణాల అద్దెలు బకాయి ఉంటే పోటీకి అనర్హులవుతారు.

నియమనిబంధనలు

  • కార్పొరేటర్‌/ కౌన్సిలర్‌గా పోటీ చేసే వారికి 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. స్థానిక సంస్థ పరిధిలో ఓటరై ఉండాలి.
  • నామినేషన్‌ వేసే వారు ఆ వార్డు, డివిజన్‌కు చెందిన ఇద్దరితో ప్రతిపాదింపజేసుకోవాలి. ఆస్తుల వివరాలతో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి
  • 1-6-1994 నాటికి ముందు ముగ్గురు పిల్లలు కలిగి ఉంటే పోటీకి అర్హులు. ఆ తరువాత అయితే అనర్హులు.
  • నామినేషన్‌ వేయడానికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.2,500 రుసుం చెల్లించాలి. పురపాలక ఖజానా లేదా బ్యాంకులో ఆ మొత్తాన్ని చెల్లించి సంబంధిత రశీదును నామినేషన్‌ పత్రాలతో కలిపి సమర్పించాలి. పోటీ నుంచి తప్పుకుంటే రుసుం తిరిగి ఇచ్చేస్తారు.
  • ప్రతి అభ్యర్థీ నాలుగు నామినేషను పత్రాలు సమర్పించవచ్ఛు. రుసుం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. నామినేషను పత్రాలను అభ్యర్థి నేరుగా లేదా అతని తరఫున ఎవరైనా అందజేయవచ్చు.

ఇదీ చదవండి : స్థానిక సంగ్రామం: నామపత్రం వేస్తున్నారా.. ఇవి గుర్తుంచుకోండి

Last Updated : Mar 11, 2020, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.