క్రికెటర్‌ను బెదిరించిన కేసులో హైదరాబాద్ వాసిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పాక్ చేతిలో భారత్ ఓటమి తర్వాత ట్విటర్‌లో హైదరాబాద్‌కు చెందిన రామ్‌నగేశ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేశాడు. ప్రముఖ క్రికెటర్‌ను ఉద్దేశించి అసభ్య పోస్టు పెట్టడంపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రికెటర్‌ను ఉద్దేశించి కామెంట్ పెట్టిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించారు. నిందితుడు రామ్‌నగేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ముంబయికి తీసుకెళ్లారు.
ఇదీచదవండి.