ETV Bharat / city

పరిషత్ ఎన్నికలు: ఏకగ్రీవాలు మినహా.. ఎన్ని స్థానాల్లో ఎన్నికలంటే..! - రాష్ట్రంలో తాజా రాజకీయాలు

రాష్ట్రంలో ఈ నెల 8న పరిషత్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏకగ్రీవాలు మినహాయించగా.. 7,265 ఎంపీటీసీ, 519 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించి ఎన్నికలు నిర్వహించే స్థానాలను ఖరారు చేసింది.

mptc zptc elections
mptc zptc elections
author img

By

Published : Apr 3, 2021, 6:50 AM IST

రాష్ట్రంలో ఈ నెల 8న 7,847 పరిషత్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. గత ఏడాది మార్చిలో 9,984 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, వివిధ కారణాలతో వీటిలో 288 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 9,696 స్థానాల్లో 2,371 ఏకగ్రీవమైనట్లు పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కడప జిల్లాలో నాలుగుచోట్ల ఎన్నికలను బహిష్కరించారు. గతేడాది వ్యవధిలో నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో మృతి చెందినవారిని మినహాయించగా మిగిలిన వాటికి ప్రస్తుతం పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. 660 జడ్పీటీసీ స్థానాల్లో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించట్లేదు. మిగిలిన 652 స్థానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి.

* ఏకగ్రీవాల్లో కడప, చిత్తూరు జిల్లాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు 432 (78.11%); 50 జడ్పీటీసీ స్థానాలకు38 (76%) ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో 858 ఎంపీటీసీ స్థానాలకు 433 (50.46%); 65 జడ్పీటీసీ స్థానాల్లో 30 (46.15%) ఏకగ్రీవమైనట్లు అధికారులు వివరించారు.

ఎన్నికల నిర్వహణకు జిల్లాకో ప్రత్యేకాధికారి

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు జిల్లాకో సీనియర్‌ అధికారిని నియమించామని, వారికి అందుబాటులో ఉంటూ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది గుర్తింపు, వారికి శిక్షణ తరగతుల్ని తక్షణమే ఏర్పాటుచేయాలన్నారు. పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై జడ్పీ సీఈవోలు, డీపీవోలతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

రత్నప్రభ తరఫున ప్రచార పర్వం ప్రారంభించనున్న జనసేనాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.