ETV Bharat / city

వృద్ధ దంపతులపై ఎంపీటీసీ భర్త విచక్షణారహిత దాడి - ఎంపీటీసీ భర్త వృద్ధదంపతులపై దాడి

Attack on Old couple: భూవివాదంలో తలెత్తిన గొడవలో ఎంపీటీసీ భర్త.. వృద్ధ దంపతులపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీ భర్త, ఆయనకు సహకరించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

attack
attack
author img

By

Published : Sep 20, 2022, 4:37 PM IST

Attack on Old couple: తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా పులిమామిడి గ్రామంలో దారుణం జరిగింది. భూవివాదంలో తలెత్తిన గొడవలో వృద్ధదంపతులపై ఎంపీటీసీ భర్త విచక్షణారహితంగా దాడి చేశారు. పొలం విషయంలో గ్రామానికి చెందిన తెలుగు యాదయ్య, రామకృష్ణారెడ్డి కుటుంబాల మధ్య వివాదం నెలకొంది.

ఈ క్రమంలో మరోసారి తలెత్తిన గొడవలో... వృద్ధులైన యాదయ్య దంపతులపై రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు దాడిచేశారు. ఈ ఘటనలో యాదయ్య, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను గ్రామస్థులు వికారాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. పొలం అమ్మాలంటూ ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి దౌర్జనం చేస్తున్నారని, ఈ క్రమంలోనే వృద్ధులపై దాడిచేసినట్లు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామకృష్ణారెడ్డి నుంచి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపారు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందించారు. గతంలోనూ ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి దాడి చేశారని బాధితులు ఆరోపించారు.

వృద్ధదంపతులపై ఎంపీటీసీ భర్త విచక్షణారహిత దాడి

'గత కొంతకాలంగా వాళ్లు మా కుటుంబంపై ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నాడు. కంప్లెంట్ ఇచ్చినా ఎవరూ చర్యలు తీసుకోలేదు. నా వెనకాల ముందు ల్యాండ్ కొన్నాడు.. నాది అమ్మాలంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. జేసీబీతోనూ దాడి చేస్తూ నా పొలానికి దారులు బంద్​ చేశాడు. ఈ రోజు నేను లేని సమయం చూసి మా అమ్మనాన్న, నా భార్యపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశాడు.'- యాదయ్య, కుమారుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.