పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేష్ దీపక్ వర్మ బులెటిన్ విడుదల చేశారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా ఉన్న భూపేందర్, రాజీవ్ చంద్రశేఖర్లు కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఈ రెండు స్థానాలకు విజయసాయి, భాజపాకు చెందిన సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ పోటీలో లేని కారణంగా.. ఆ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు.
ఇదీ చదవండి:
LOANS: రాష్ట్రానికి ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన రుణాల మొత్తం ఎంతంటే..!