ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని..... భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. అయితే కొందరు వైకాపా నేతల తీరు వల్ల....అనవసరపు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్న నేతలు పద్ధతి మార్చుకోకుంటే.....ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా జరిగే పనికాదని... 18వేల కోట్ల రూపాయల ప్యాకేజీ నిధులు తీసుకుని రాయలసీమ, వెనకబడిన జిల్లాలకు ఖర్చు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి చెప్పారు.
వీలైనంత త్వరగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని, భాజపా ఎంపీ టీజీ వెంకటష్.....రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల దగ్గర నుంచి నీటిని తీసుకనే అంశంపై....కావాలనే తెలంగాణ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. ట్రైబ్యునల్ కూడా రాయలసీమ నీళ్లు తీసుకెళ్లొచ్చని చెప్పిందన్నారు. మూడు రాజధానులు ఇప్పట్లో జరిగే అంశం కాదని టీజీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: