ETV Bharat / city

అలాంటిదేమైనా ఉంటే నాపై కేసులు పెట్టకోవచ్చు:సుజనా చౌదరి - నాసిరకం ట్వీట్లపై స్పందించను: సుజనా చౌదరి

ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వైకాపా ప్రభుత్వ పాలన విధానాలతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతోందని విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేసే నాసిరకం ట్వీట్లపై స్పందించనన్నారు. నిజంగా అమరావతిలో ఇన్​సైడర్​ ట్రేడింగ్​ జరిగితే కేసులు పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు.

నాసిరకం ట్వీట్లపై స్పందించను: సుజనా చౌదరి
author img

By

Published : Aug 29, 2019, 8:48 PM IST

ఎంపీ విజయసాయిరెడ్డి చేసే నాసిరకం వ్యాఖ్యలు, ట్వీట్లపై తాను స్పందించనని భాజపా ఎంపీ సుజనా చౌదరి ఘాటు సమాధానమిచ్చారు. అమరావతిలో ఇన్​సైడర్​ ట్రేడింగ్​ చేయలేదని స్పష్టం చేశారు. అలాంటిదేమైనా ఉంటే కేసులు పెట్టకోవచ్చని సవాల్​ చేశారు.

ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది: సుజనా చౌదరి

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ముంచే విధంగా ఉన్నాయి. ఆయన దిగజారి మాట్లాడుతున్నారు. అతను చేసే నాసిరకం ట్వీట్లకు స్పందించను. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేయలేదు. అలా జరిగిందని అనుమానముంటే కేసులు పెట్టుకోవచ్చు. 2013 తర్వాత అమరావతిలో రిజిస్ట్రేషన్‌ చేయలేదు. ఆ విధంగా జరిగితే విచారణ జరిపించాలి. అనైతికంగా ఎవరు ఏం చేసినా కేసులు పెట్టండి. వ్యాపారంలో లాభాలు, నష్టాలు సహజం. ఆర్థిక నేరాలు వేరు.. ఆర్థిక ఇబ్బందులు వేరు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. వ్యాపారవేత్తగా అప్పులు ఇచ్చే వ్యక్తులు ఉంటే తీసుకుంటా. ఈ విషయంపై ఎలా వెళ్లాలో న్యాయవాదిని సంప్రదిస్తున్నాం. ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.. రాజధానిలో అన్ని పనులు ఆగిపోయాయి.

-- సుజనా చౌదరి , భాజపా ఎంపీ.

ఇవీ చదవండి...అమరావతిని ముంచాలని చూస్తున్నారా?:సుజనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.