ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం సవతి ప్రేమ చూపుతోందని వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు క్యాబినెట్ ప్రణాళిక సిద్ధం చేయడాన్ని వైకాపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎంపీ అన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరిస్తే రాష్ట్రానికి మిగిలేదేమీ ఉండదని అన్నారు. ప్రైవేటీకరణపై పునరాలోచించాలని ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయం రాష్ట్ర ప్రజలను కోపోద్రిక్తులను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అవసరమైన సూచనలతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాశారని తెలిపారు.
జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు... తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లోని జాతీయ రహదారులకు బడ్జెట్‌లో రూ.వేల కోట్లు ప్రతిపాదించారని... ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క ప్రాజెక్టూ ప్రకటించలేదని వాపోయారు. కొచ్చి, బెంగళూరు, చెన్నై, నాగ్‌పుర్ మెట్రోలకు నిధులు ప్రతిపాదించారని... విశాఖ, విజయవాడ మెట్రో ప్రస్తావన చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో అసాధారణ జాప్యం జరుగుతోందని అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం, రామాయపట్నం ఓడరేవు, విశాఖ-చెన్నై కారిడార్ మంజూరు చేయాలని .. ఆంధ్రప్రదేశ్‌కు కిసాన్ రైళ్లు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేకప్యాకేజీ అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: