Raghu Ramakrishna Raju: సాక్షాత్తూ అసెంబ్లీలో సీఎం జగన్ న్యాయవ్యవస్థపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దారుణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా మాట్లాడకూడదని సూచించారు. న్యాయ వ్యవస్థను గౌరవించకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న రఘురామ.. జగన్ బెయిల్‌పై ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 3 రాజధానులు అమలు చేయాలంటే పార్లమెంటులో సవరణ చేయక తప్పదని రఘురామ అన్నారు. అసత్యాలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేస్తారా? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: జగన్ ప్రిజనరీ.. చంద్రబాబు విజనరీ - లోకేశ్