రాష్ట్రంలోని అప్పుల విధానంపై కాగ్ ఆడిట్ జరిపించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని మోదీని కోరారు. రూ. 25వేల కోట్ల అప్పుపై పూర్తి స్థాయిలో కాగ్‌తో ఆడిట్ జరిపించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులకు రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరిట ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల కోసం సుమారు సంవత్సరానికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం ఉందన్నారు. చెప్పిందే చెప్పి.. చేసిందే చేసి.. ప్రచారాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా ఈ అప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఇవాళో రేపో అనర్హత వేటు వేసే వ్యక్తి మాటలు ఎందుకు వినాలి అని అనుకోవద్దని హితవు పలికారు.
-
ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి, అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది.https://t.co/M0hKq8zMGV
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి, అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది.https://t.co/M0hKq8zMGV
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 23, 2021ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి, అప్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది.https://t.co/M0hKq8zMGV
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 23, 2021
ఇదీ చదవండి:
NGT: రాయలసీమ ఎత్తిపోతలపై తనిఖీ చేసి నివేదిక ఇవ్వండి.. కృష్ణా బోర్డుకు ఎన్జీటీ ఆదేశం